ఆత్మకూరు మండలంలో శాసనమండలి అస్సూరెన్సు కమిటీ పర్యటించింది.ప్రభుత్వ హామీల అమలు పరిశీలనలో భాగంగా వైయస్సార్ స్మృతి వనంను సందర్శించిన ఎమ్మెల్సీలు. వైయస్సార్ స్మృతి వనంలో అన్ని ప్రదేశాలను ఎమ్మెల్సీలు పరిశీలించారు.ఈ పర్యటనలో అస్సూరెన్సు కమిటీ చైర్మన్ ఇషాక్ బాషా, సభ్యులు MLC రామచంద్రారెడ్డి, MLC కావురి శ్రీనివాస్. పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్మృతి వనాన్ని పర్యాటక రంగంగా మరింత తీర్చిదిద్దామని, వైయస్సార్ మరణించిన పావురాల గుట్ట చూసేందుకు ఏర్పాటు చేసిన వ్యూ టవర్ ను పరిశీలించారు.వ్యూ టవర్ ఎక్కేందుకు త్వరలోనే లిఫ్ట్ ఏర్పాటు చేయమని అదికారులకు తెలియజేశారు.