హనుమకొండ: హనుమకొండ నుంచి హైదరాబాద్కు 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
హనుమకొండ నుంచి హైదరాబాద్కు బుధవారం 300 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపారు. సుమారు 30 వేల మంది ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపి అందరినీ సురక్షితంగా చేర్చినట్లు వరంగల్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ భవానీ ప్రసాద్ తెలిపారు.