ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి..బచ్చింత, ఉసిరికపాడు గ్రామాల్లో కొయ్యూరు మండల హౌసింగ్ ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు
పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కొయ్యూరు మండల హౌసింగ్ ఏఈ పొత్తూరు ఉమామహేశ్వరరావు లబ్దిదారులకు సూచించారు. గురువారం సాయంత్రం డౌనూరు గ్రామ సచివాలయ పరిధిలోని బచ్చింత, ఉసిరికపాడు గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. డిశంబరు నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. బిల్లులు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.