డోన్: తాగునీరు అక్రమ మళ్లింపు పై డోన్ ఎమ్మెల్యే కోట్ల ఆగ్రహం
Dhone, Nandyal | Oct 3, 2026 నంద్యాల జిల్లా డోన్ మండలం ఇంద్రంపల్లె గ్రామంలో హంద్రీనీవా తాగునీటి పైపులైన్‌ను కొందరు పొలాలకు అక్రమంగా మళ్లించిన విషయం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి దృష్టికి రైతులు తీసుకొచ్చారు. వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.