కల్వకుర్తి: జిల్లెల్ల గ్రామంలో శ్రీ కోట మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ
కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో శ్రీ కోట మైసమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లెల్ల రాములు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి పండుగ నిర్వహిస్తామని వారు వెల్లడించారు.