శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం టీవీ ఉద్యోగి చంద్రశేఖర్ శర్మ పై కత్తెరతో దాడి
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీశైల టీవీ ఉద్యోగి చంద్రశేఖరశర్మపై హత్యాయత్నం జరిగింది. మాచర్లకు చెందిన శ్రీను అనే వ్యక్తి కత్తెరతో దాడి చేసాడు. శ్రీశైలంలోని సిద్ధరామప్ప కాంప్లెక్స్‌లో దుకాణం నిర్వహిస్తున్న చంద్రశేఖరశర్మపై, పక్కనే ఉన్న బేకరీలో పనిచేస్తున్న శ్రీను పరస్పర వివాదాల నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చంద్రశేఖరశర్మ మెడ, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దేవస్థానం సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు దాడికి ఉపయోగించిన కత్తెరను స్వాదినం చేసుకొన్నారు