సంగారెడ్డి: చెరువు కుంటలలో చేప పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
చెరువుకుంటలలో చేప పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల విడుదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. చెరువులు కుంటలలో చేప పిల్లల విడుదల చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.