గుంటూరు: గుంటూరు జిజిహెచ్ లో డయారియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్
Guntur, Guntur | Sep 17, 2025 గుంటూరు నగరంలో డయేరియా కలకలం మరోసారి మొదలైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పలు కాలనీల వాసులు వాంతులు, విరేచనాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వారికి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే నసీర్ ఆసుపత్రికి వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను సూచించారు.