శ్రీశైలం: వెలుగోడు పట్టణ శివారులోని రిజర్వాయర్ వద్ద ఎలుగుబంటి సంచారం. భయాందోళనలో వాహనదారులు వాహనదారులు
వెలుగోడు పట్టణ శివారులో పిల్ల కాలువ, రిజర్వాయర్ వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది.. అటుగా వెళ్తున్న వాహనదారులకు ఎలుగుబంటి కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వారు స్థానిక అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెలుగోడు కాలేజీ పరిసర ప్రాంతాలు, పిల్ల కాలువ , రిజర్వాయర్ వద్దకు వెళ్లే ప్రజలు, వెలుగోడు నుంచి ఆత్మకూరు కు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఎలుగుబంటి సంచారం స్థానిక యువకులు తమ సెల్ఫోన్లో బంధించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.