మెట్పల్లి: రుద్రంగి మండలంలో గల్ఫ్ ఏజెంట్ అజ్మీరా కిషన్‌పై మరో కేసు నమోదు
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కొలకని రవి అను వ్యక్తి నుండి అజర్ బైజన్ అను దేశం పంపిస్తానని అడ్డ బోర్ తండా కు చెందిన అజ్మీరా కిషన్ S/o. పరశురాం అను వ్యక్తి నమ్మించి మోసం చేసి 2,75,000/- రూ. తీస్కొని వీసా ఇవ్వకుండా తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడు. అజ్మీరా కిషన్ అను వ్యక్తి పైన ఇప్పటికే రుద్రంగి పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు నమోదయ్యాయి, వివిధ పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యి అరెస్టు అయ్యి , జైల్ నందు ఉన్నాడు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే పోలీసు స్టేషను నందు సంప్రదించగలరనీ రుద్రంగి ఎస్ఐ సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు..