ముఖ్యమంత్రి సభలో నినాదాలు చేస్తే అరెస్టు చేసి హింసిస్తారా,మాధవను వెంటనే విడుదల చేయాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశంలో మదనపల్లి అభివృద్ధి కోసం ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మాధవ్ నినాదాలు చేస్తే అరెస్టులు చేసి హింసిస్తారా అంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రాంతంలో విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మదనపల్లి మెడికల్ కళాశాల ప్రైవేట్ పదం చేయడం ప్రభుత్వ ఆసుపత్రి సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం వీటి కళాశాలను యూనివర్సిటీగా చేయాలని మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తే కలెక్టర్ ఎస్పీ మాధవను అక్రమంగా అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించారు