సంగారెడ్డి: నవంబర్ 1 నుంచి గాలి పోచమ్మ ఆలయ ప్రతిష్టాపన వేడుకలు, కరపత్రాలను విడుదల చేసిన ఆలయ కమిటీ సభ్యులు.
సంగారెడ్డి పట్టణం రాజంపేటలోని గాలి పోచమ్మ ఆలయ జీర్ణ ప్రతిష్టాపన వేడుకల కరపత్రాలను బుధవారం ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. నవంబర్ 1న గాలి పోచమ్మ నాగదేవత అమ్మవారి పక్షాన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. బృందం సభ్యులు విట్టల్ రెడ్డి, కుంటల సత్యనారాయణ, పూజారి ప్రభాకర్, టేకుల భూపాల్, టేకుల ఆనంద్, జయరాం, మల్లేష్, మోహియొద్దీన్, తాండ్ర రాజు, వినయ్, కృష్ణ పాల్గొన్నారు.