శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం పై ఆది దంపతుల విహరింపు పాల్గొన్నఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు,
శ్రీశైలంలో ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోకాకళ్యాణార్ధం శ్రీస్వామి అమ్మవారికి దేవస్థానం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు,ట్రస్టు బోర్డు సభ్యులు స్వర్ణరథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు,అరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీమల్లికార్జునస్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించి అనంతరం స్వర్ణరథోత్సవంలో ఆశీనులైన శ్రీస్వామి అమ్మవారికి అర్చకస్వాములు, ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు స్వర్ణరథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, మళ్ళీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు రథోత్సవం నిర్వహించారు,