ఒంగోలు అర్బన్: సమాజంలో మానవ అక్రమ రవాణా పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే అందరూ అన్ని శాఖల సహకారం అవసరం: జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి
Ongole Urban, Prakasam | Jul 30, 2026
సమాజంలో మానవ అక్రమ రవాణా అనే అమానుషమైన చర్యను పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి స్పష్టం చేశారు. గురువారం అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా కార్మిక శాఖ, బాలల సంరక్షణ యూనిట్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, పోలీసు వ్యవస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, దిశ పోలీస్ సిబ్బంది, హెల్ప్ (HELP) మరియు సార్డ్స్ (SARDS) స్వచ్ఛంద సంస్థల సహకారం అవసరమన్నారు