ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేస్తే ఉద్యమిస్తామిస్తామని కార్మిక సంఘాలు కన్నెర చేశాయి. వామపక్ష కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం కడప సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగ సుబ్బారెడ్డి సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులరెడ్డి వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి రైతు సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరి రెడ్డి హెచ్చరించారు.