ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణమండపంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం పాల్గొన్న MLA బుడ్డా
ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహానాడు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చలు నిర్వహించారు.