పార్వతీపురం: బలిజీపేటలో టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వందలాది మంది చేరిక
బలిజీపేట మండలంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వెంగాపురం, బర్లి గ్రామాలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు మరియు 100 టీడీపీ కుటుంబాలు వైసీపీలో చేరాయి. జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే అభివృద్ధికి మార్గమని వారు స్పష్టం చేశారు.