ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని వెంకటపురం కాలానికి చెందిన రాఘవేంద్ర (42) అప్పుల బాధ తల లేక రైతు ఆత్మహత్య
ఎమ్మిగనూరులో రైతు ఆత్మహత్య..ఎమ్మిగనూరులోని వెంకటపురం కాలానికి చెందిన రాఘవేంద్ర (42) రైతు రెండు ఎకరాల్లో ఉల్లి, మిరప పంట సాగు చేశారు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని అప్పుల బాధతో మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు మృతుడి అన్న వెంకన్న తెలిపారు.ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.