శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ నెలకొనింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి 6:00 సమయం పడుతుందని EO శ్రీనివాసరావు తెలియజేశారు.వేసవి శెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామి దర్శించుకుంటున్నారు. స్వామి అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, కర్ణాటక ,మహారాష్ట్ర, తమిళనాడు, నుండి భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలం చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.భక్తుల రద్దీ దృష్ట్యా అని వసతులు ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలియజేశారు. క్యూలైన్లో పండ్లు మంచినీరు అల్పాహారం అందజేస్తున్నామని అధికారులు తెలియజేశారు.