బోధన్: గ్రామాలలో మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకెపి కృషి: ఎడపల్లిలో ఏపీఎం రాజేందర్
గ్రామాలలోని మహిళా సంఘాల అభ్యున్నతికి ఐకెపి కృషి చేస్తుందని ఏపిఎం రాజేందర్ అన్నారు. మంగళవారం ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మండలంలో ఇప్పటికి రూపాయలు 56 కోట్ల టర్న్ అవ్వరు చేరుకున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు. గ్రామీణ మహిళలకు దీర్ఘకాలిక అరుణతో పాటు, సూక్ష్మస్థాయి రుణాలను రూపాయలు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాల రుణాల రికవరీలో ముందున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలను బాగుపరచుకోవాలని అన్నారు.