శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం లడ్డు విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి చేసిన దేవస్థాన చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు
శ్రీశైలదేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ముందుగా లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాలలో స్టాకు నమోదును పరిశీలించారు. లడ్డు ప్రసాద టికెట్ల జారీ విధానాన్ని తనిఖీ చేయడంతో పాటు, కౌంటరులో జరిగిన అమ్మకాలకు నగదు సరిపోతుందో లేదో పరిశీలించి ధృవీకరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో ఎల్లప్పుడూ పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రసాదాల నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా భక్తులకు ఉత్తమ ప్రమాణాలతో అందించాలని సూచించారు.