వనపర్తి: వనపర్తి లో నీతి అయోగ్ న్యూఢిల్లీ బృందం పర్యటన
శనివారం వనపర్తి జిల్లా కేంద్రానికి నీతి అయోగ్ ఉప కార్యదర్శి అరవింద్ కుమార్ బృందం చేరుకుంది. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఘనంగా స్వాగతం పలికారు.వనపర్తి జిల్లాలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరియు ప్రజలకు అందిస్తున్న త్రాగునీరు ప్రమాణాలను నీతి అయోగ్ ఉప కార్యదర్శి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షిస్తారని వనపర్తి జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు