రాయపర్తి: వరంగల్ నుండి సూర్య తండ మీదుగా అన్నారం వెళ్లే ప్రత్యేక బస్సు ను ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
వరంగల్ జిల్లా రాయపర్తి లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు. గత కొన్నాళ్లుగా బస్సు ప్రయాణం కలగా మారిన సూర్యతండా వాసులకు ఎమ్మెల్యే శుభవార్త చెప్పారు. వరంగల్ నుండి సూర్య తండ మీదుగా అన్నారం వెళ్లే ప్రత్యేక బస్సు కు ఆమె పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న బస్సు తమ గ్రామం నుంచి ప్రారంభించడం పట్ల తండావాసులు ఆనందం వ్యక్తం చేశారు. కలగా మారిన బస్సు ప్రయాణాన్ని సుగమం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తండావాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.