పటాన్చెరు: పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం
పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది. డివిజన్ పరిధిలోని సాయిరాం నగర్ కాలనీకి చెందిన మధు కుమారి (21) హైదరాబాద్ మదీనగూడ పరిధిలోని షాపింగ్ మాల్లో పనిచేస్తుంది. సోమవారం ఉదయం పనికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. యువతి ఆచూకీ లభించలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.