ప్రభుత్వ సర్వజన వైద్యశాల అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలు, టోకెన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తక్కువ ధరకు రుచికరమైన భోజనం అందుతున్నదని భోజనం చేస్తున్న వారు తెలిపారు. క్యాంటీన్లో లోపాలు లేకుండా పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని, భోజన నాణ్యతపై రోజువారీ తనిఖీలు చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆమెతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు ఉన్నారు.