అమరాపురం మండలంలో పంచాయతీ నిధులతో తెచ్చిన బోరు పైపులు కేబులు దాచుకున్న వైకాపా నాయకుడు.
అమరాపురం మండలం హేమావతి పంచాయతీ గొల్ల మారణపల్లి గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు రంగప్ప పంచాయతీ బోర్లకు వేసే పైపులు కేబుల్ వైర్లను అక్రమంగా తన ఇంటిపైన పెట్టుకున్నాడని అదే గ్రామానికి చెందిన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.పంచాయతీ నిధులతో గ్రామ తాగునీటి పైప్ లైన్ లకు ఉపయోగించే సామాగ్రిని అక్రమంగా ఇంట్లో పెట్టుకున్నాడని ఊరి అవసరాలకు కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.