మండపేట: రాయవరం మండలంలో మాచవరం, సోమేశ్వర గ్రామాలకు చెందిన 40మంది వాలంటీర్లు రాజీనామా..
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మరొక్క సారి సీఎం పీఠం ఎక్కించి తీరుతామని రాయవరం మండలం మాచవరం, సోమేశ్వర గ్రామాలకు చెందిన వాలంటీర్లు స్పష్టం చేసారు. ఈ మేరకు శుక్రవారం మాచవరం 26, సోమేశ్వరం 14 మంది వాలంటీర్లు స్వచ్ఛంద రాజీనామా చేసారు. పంచాయితీ సెక్రటరీకి వాలంటీర్లు 40 మంది తమ రాజీనామ పత్రాలు అందించి తమ విధులకు స్వస్తి పలికారు. నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు విజయానికి ప్రయత్నలోపం లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు.