సామర్లకోటలో మార్కెట్ కమిటీ, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
కాకినాడ జిల్లా సామర్లకోటలో యార్లగడ్డ రైతు భవనం నందు మంగళవారం ఉదయం, సామర్లకోట యార్లగడ్డ సామర్లకోట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప, డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. కూటమి నాయకులఆధ్వర్యంలో ఈ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార వేడుక జరిగింది.ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో అందుగుల మణికుమారి చక్రవర్తి చైర్పర్సన్ గా, ఇతర సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు.