శ్రీశైలం: వెలుగోడు పట్టణంలో అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2026-27 తొలి విడత నిధుల విడుదల కార్యక్రమం.పాల్గొన్న MLA
వెలుగోడు మండల కేంద్రంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ 2026-27 తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7వేల చొప్పున జమ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులతో మమేకమైన ఎమ్మెల్యే ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు, సాగునీటి భద్రత, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై చర్చించారు. రైతుల సంక్షేమం,వ్యవసాయాభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు