పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విశ్వేశ్వర నాయుడు
పెదబయలు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా పి.హెచ్.సి పెదబయలు వైద్యాధికారితో మాట్లాడుతూ వైద్యం కొరకు వచ్చే రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీసారు. ఓ పి రిజిస్టర్ లో నమోదు చేస్తున్న రోగుల వివరాలను పరిశీలించారు, అనంతరం ల్యాబ్ గదిని పరిశీలింఛి జ్వర లక్షణాలు మరియు ఇతర వ్యాధులతో వచ్చే రోగులకు నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరిక్షల రికార్డులను తనిఖి చేసారు.