భీమవరం: స్వర్ణాంధ్ర స్వర్గాంధ్ర కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన పురపాలక సంఘం కమిషనర్ రామచందర్ రెడ్డి
భీమవరం పురపాలక సంఘ కార్యాలయం నందు భీమవరం పురపాలక సంఘ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరియు ఆర్ పి లకు స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి వ్యర్ధాలను ఇంటి వద్దనే హోం కంపోస్టింగ్ చేసుకునే విధానంపై మరియు హోం కంపోస్టు ద్వారా వచ్చిన కంపోస్ట్ ఎరువును టెర్రస్ గార్డెన్ నందు ఏవిధంగా వినియోగించవచ్చో అధికారులు సభ్యులకు వివరించడం జరిగింది. తద్వారా రోజు ఇంటి వచ్చు తడి వ్యర్ధాలను కంపోస్టు ఎరువుగా మార్చుకుని మనకు అవసరమైన కూరగాయలను సేంద్రియ పద్ధతిలో పండించుకునే విధానంపై కమిషనర్ అవగాహన కల్పించారు.