క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ డ్రెస్లను అందించిన అనంతరం మాట్లాడారు. క్రీడా శిక్షకులు క్రీడాకారులను ప్రోత్సహించి వారి నైపుణ్యతను వెలికి తీయాలన్నారు. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు గుర్తింపుని తెస్తాయని.. వారి భవిష్యత్తును తీర్చి దిద్దుతాయని పేర్కొన్నారు.