అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని చెరువు కట్ట వద్ద రైతు పైకి దూసుకువచ్చిన లారీ రైతు కు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
అనంతపురం నగర శివారులోని చెరువు కట్ట సమీపంలో ఆటోలో ప్రయాణిస్తున్న పాత చదుళ్ల గ్రామానికి చెందిన గంగన్న అనే రైతు ఒక్కసారిగా ఆటోలో నుంచి కింద పడడంతో వెనుక వస్తున్న లారీ అతని కాళ్లపై నుంచి వెళ్లడంతో రైతుకు తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.