నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు ఎస్సీ కాలనీలో పది అడుగుల కొండచిలువ మంగళవారం భయభ్రాంతులకు గురి చేసింది. కాలనీవాసులు వెంటనే బనగానపల్లెకు చెందిన స్నేక్ క్యాచరు సమాచారం ఇచ్చారు. ఆయన అతి కష్టం మీద పట్టుకుని సురక్షితంగా బనగానపల్లె అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.