విశాఖలో భారత్ నివేష్ మారథాన్ కార్యక్రమంలో నిడదవోలు విద్యార్థికి రెండో స్థానం, అభినందించిన కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది
విశాఖపట్నం బీచ్ రోడ్‌లో అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా(ఏఎంఎఫ్ఐ), సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) సంయుక్తంగా భారత్ నివేష్ మారథాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అండర్-17 5కె రన్‌లో నిడదవోలు S.V.R. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి రవి రెండోస్థానం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు రవిని అభినందించారు.