నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద పోటెత్తిన వాహనదారులు, పెట్రోల్,డీజిల్ లేక మూతబడ్డ బంకులు
Nandyal Urban, Nandyal | Apr 24, 2026
పెట్రోల్,డీజిల్ కొరత అంటూ పుకార్లు లేవడంతో నంద్యాల జిల్లాలోని అన్ని పట్టణాల్లో పెట్రోల్ బంకుల వద్దకి వాహనదారులు పోటెత్తారు. నంద్యాల జిల్లాలో గత కొన్ని రోజులుగా కొన్ని పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో పచ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోల్,, డీజిల్ కొరత అంటూ పుకార్లు మొదలయ్యాయి. వాహనదారులు పుకార్లను నమ్మి డ్రమ్ములు తీసుకొని పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ విషయంపై స్పందించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లాలోని పెట్రోల్ నిలవులపై ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లాలో ఎటువంటి కొరత లేదంటూ ఆమె తెలిపారు. అవసరానిక