నంద్యాల అర్బన్: నంద్యాలలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని PDSU నిరసన
Nandyal Urban, Nandyal | Jul 4, 2026
విద్యారంగ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని PDSU నేత రాంబాబు పేర్కొన్నారు.విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నంద్యాలలోని పద్మావతి నగర్ లో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రూ.10,700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే జీవో 77ను వెంటనే రద్దు చేయాలన్నారు.