ప్రభుత్వ బడులలో మీ పిల్లల బంగారు భవిష్యత్తు దాగి ఉంది :పలుకూరు హెచ్ఎం మల్లికార్జునరావు
ప్రభుత్వ బడులలో మీ పిల్లల బంగారు భవిష్యత్తు దాగి ఉందని హెచ్ఎం మల్లికార్జున రావు, జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద చారి అన్నారు. సోమవారం బనగానపల్లె మండలం పలుకూరులో బడిబాట బంగారు బాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం బడులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, మెరుగైన బోధన విధానాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.