కోట్లవారి పల్లి వద్ద పెద్దేరు వాగు ప్రవాహం రాకపోకలు బంద్.
అన్నమయ్య జిల్లా. తంబళ్లపల్లె నియోజకవర్గం. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా పెరిగింది. శుక్రవారం ఉదయం మొలకలచెరువు మండలం కొట్లవారిపల్లె వద్ద పెద్దేరు వాగులో వరద ప్రభావం పెరగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తంబళ్లపల్లె-ములకలచెరువు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.