డోన్: యాడికి వద్ద ప్యాపిలి మండల వాసి మృతి
Dhone, Nandyal | Jun 21, 2026 నంద్యాలజిల్లా ప్యాపిలి మండలం బురుగుల గ్రామానికి చెందిన బాలమద్దిలేటి (55) కుమార్తెను చూడటానికి వెళ్లి మృతిచెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. నాలుగురోజుల క్రితం అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డిపల్లిలో ఉన్న తన కూతురి దగ్గరికి వెళ్లారు. ఈయన మూర్చ వ్యాధితో బాధపడుతూ ఉండేవారు. ఈ క్రమంలో మూర్చ వచ్చి తిప్పారెడ్డిపల్లి సమీపంలో ముళ్లపొదల్లో పడి చనిపోయినట్లు యాడికి సీఐ తెలిపారు