నంద్యాల అర్బన్: నల్లమల ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం, నాలుగు గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ జాం
Nandyal Urban, Nandyal | May 1, 2026
నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో గ్రానైట్ రాళ్లు తరలించే లారీలు ఒకదాని వెంట ఒకటి ఢీకొనడంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఘాట్లో వెళ్తున్న ఒక లారీ శుక్రవారం ఆగిపోగా బ్రేకులు పడక పోవడంతో వెనుక ఉన్న మరో లారీని ఢీకొనడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో నంద్యాల, గిద్దలూరు వెళ్లే వైపు భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ప్రయాణికులు తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు అంతరాయం ఏర్పడింది.