పుంగనూరు: ఢాబా లలో. హోటల్ లలో మద్యం సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవు. సిఐ సుబ్బారాయుడు.
చిత్తూరు జిల్లా.పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో డాబా లలో మరియు, హోటళ్ళలో మద్యం సేవించిన, మద్యం విక్రయించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సుబ్బరాయుడు సోమవారం రాత్రి పది గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ హోటల్స్, ఢాబా ల్లో మద్యం విక్రయాలు, మద్యం సేవించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసిన యెడల పోలీసులకు సమాచారం తెలిపాలని కోరారు. డాబాల్లో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు.