డోన్: బేతంచెర్ల బయటిపేటలో మౌలాలి స్వామి జార్తుల వేడుకలు
Dhone, Nandyal | Jun 28, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల బైటి పేట కాలనీలో వెలసిన మౌలాలి స్వామి దర్గాలో జార్తుల వేడుకలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు ప్రత్యేక పుష్పమాలలు సమర్పించి పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.