నంద్యాల అర్బన్: పొలాల మధ్య నాలుగు కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించి జలధార జలహారతి కార్యక్రమం పరిశీలించిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 23, 2026
నంద్యాల జిల్లాలో జలధార జల హారతి కార్యక్రమం కింద చేపడుతున్న నీటి సంరక్షణ చెరువులో పునరుద్ధరణ సాగునీటి వనరుల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు సోమవారం జూపాడుబంగ్లా మండలంలోని పంగిడించ గ్రామంలో జల ధార జల హారతి పథకం కింద చేపట్టిన ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులు చెరువుకు నీరు చేరే సరఫరా కాలువలు మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల అభివృద్ధి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని వాహనమార్గం అందుబాటులో లేకపోవడంతో అధికారులతో సిబ్బందితో కలిసి ఆటోలో ప్రయాణించి పనులను తనిఖీ చేశారు