రైతు సమస్యలపై కనగానపల్లిలో ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చిన జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహదేవయ్య
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవ ఆధ్వర్యంలో రైతు సమస్యల పైన కనగానపల్లి మండలంలో ఎమ్మార్వోకు వినిత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యసాయి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవ మాట్లాడుతూ రైతు సమస్యల పైన ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రైతులకు రైతు సుఖీభవ పథకం ప్రారంభించి రైతులకు పెట్టుబడి సాయం అందించాలని 90 శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.