పలమనేరు: పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ అందజేసి మానవత్వం చాటుకున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం
పలమనేరు: మున్సిపల్ కార్యాలయం నందు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం సుమారు 110మంది పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ, ఎండనక వాననక పారిశుద్ధ్య కార్మికులు నిత్యం ప్రజా సేవలో మునిగి తేలుతుంటారు వారివలనే పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో స్వచ్ఛత అవార్డు లభించిందన్నారు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదర్శ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు మాట్లాడుతూ. తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు జరుపుతామన్నారు.