అమీర్‌పేట్ పరిధి ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక కీర్తి అపార్ట్మెంట్స్ జీ బ్లాక్‌లో నివాసం ఉండే నర్సి నాయుడు, ఐశ్వర్య దంపతుల ద్వితీయ కుమారుడు హర్షవర్ధన్ (5) లిఫ్ట్ లో ఇరుక్కుపోయి విలవిలలాడాడు. బాలుడు డోర్ తెరిచి కిందికి దిగే సమయంలో లిఫ్ట్ కింద ఇరుక్కున్నట్లు సమాచారం. స్థానికులు బాలుడిని బయటకు తీసి బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు