నిజామాబాద్ సౌత్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో గల బస్ డిపో- 1 ఎదురుగా GGH ప్రహరీ గోడ దగ్గర గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. 50-55 సంవత్సరాలున్న అతడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, మృతుడి వాలకాన్ని బట్టి భిక్షాటన చేసుకునే వ్యక్తిగా తెలుస్తోందన్నారు. ఆ వ్యక్తి గురించి ఏమైనా సమాచారం ఎవరికైనా తెలిస్తే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని SHO కోరారు.