పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి పోటెత్తిన వరద ప్రవాహం
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం పూర్తి ఎత్తినట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 26 క్రస్ట్ గేట్లను ఎత్తినట్లు తెలిపారు. 16 క్రస్టు గేట్లు 10 ఫీట్లు 10 క్రస్ట్ గేట్లు ఐదు ఫీట్లు మేర ఎత్తి నీటిని 3,07,284 క్యూసెక్కుల నీటిని దిగువనకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం నీటిమట్టం 586.70 అడుగులు అని తెలిపారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందన్నారు.