బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో ఈనెల 11వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు : కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 11 వరకు 'పోలీస్ 30 యాక్ట్' అమల్లో ఉంటుందని CI రమేశ్ బాబు సోమవారం తెలిపారు . రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరడం, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధం విధించారు. అత్యవసరంగా ఎలాంటి సమావేశాలు లేదా వేడుకలు నిర్వహించాలన్నా ముందస్తుగా డీఎస్పీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు